ఖమ్మం జిల్లాలో దారుణం.. కంట్లో కారం చల్లి మామపై కోడలి దాడి.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న కోడలు

ఖమ్మం జిల్లాలో దారుణం.. కంట్లో కారం చల్లి మామపై కోడలి దాడి.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న కోడలు

ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. కంట్లో కారం చల్లి మామపై కోడలు దాడి చేసింది. కంట్లో కారం చల్లడంతో ఆ వృద్ధుడు ఆర్తనాదాలు చేశాడు. ఈ దాడికి పాల్పడిన సదరు మహిళ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండటం గమనార్హం. ఆస్తి కోసం మామను అంతం చేయాలని కోడలు పథకం పన్నింది. చెల్లెళ్లతో కలిసి మామపై కోడలు దాడికి పాల్పడింది.

పోలీస్ స్టేషన్లో వృద్ధుడు తన కోడలిపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తొమ్మిది పదుల వయసున్న మామ నుంచి రావాల్సిన ఆస్తి కోసం కోడలు ఇంత క్రూరమైన చర్యకు పూనుకుంది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కోనాయపాలెం గ్రామంలో మామపై కారం చల్లి దాడి చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన కోడలు శారద గురించి తెలిసి స్థానికులు ఆమెను చీత్కరించుకుంటున్నారు.

Also Read:-ఆదిలాబాద్ లో స్కూల్ పిల్లలపై విషప్రయోగం..

మామ నుంచి సంక్రమించాల్సిన ఆస్తులు రావాలని గత మూడేళ్ల నుంచి ఆ ముసలాయనను కోడలు వేధిస్తుంది. వాంకుడోతు రాములు, -సాలికి ముగ్గురు కుమారులు. సాలి ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందగా రాములు కోనాయపాలెంలోని తన నివాసంలోనే ఉంటున్నాడు. రాములు తొమ్మిది పదుల వయస్సులో ఉన్నాడనే కనికరం లేకుండా ఇద్దరు చెల్లెళ్లతో కలిసి వచ్చి రాములుపై దాడి చేసిన ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఏన్కూరు పోలిస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.