
హైదరాబాద్: KPHBలో భర్తపై విరక్తి చెంది భార్య అతనిని చంపి పూడ్చిపెట్టిన ఘటన వెలుగుచూసింది. 15 ఏళ్లుగా భయంకరమైన రోగంతో భార్యాభర్తలు బాధపడుతున్నట్లు తెలిసింది. భార్య, భర్తకు ఇద్దరికీ వేరువేరుగా వివాహేతర సంబంధాలు ఉన్నాయి. దీంతో.. కొన్నాళ్ల నుంచి భార్యాభర్తలు వేరువేరుగా ఉంటున్నారు. అయినప్పటికీ భర్త నుంచి ఆమెకు వేధింపులు ఆగలేదు. దీంతో.. భర్త వేధింపులు భరించలేక చెల్లెలి భర్త సహాయంతో సాయిలును అతని భార్య కవిత హత్య చేసింది.
సాయిలుకు కరెంటు షాక్ పెట్టి చంపిన అతని భార్య కవిత శవాన్ని పూడ్చిపెట్టింది. పూడ్చిపెట్టి సాయిలు భార్య కవితో పాటు ఆమె చెల్లెలు పారిపోయింది. ఈ హత్య తర్వాత కవిత కొన్ని రోజుల క్రితం సొంతూరు వెళ్లిపోయింది. సాయిలు గురించి గ్రామస్తులు అడగ్గా.. కొన్ని రోజుల నుంచి సాయిలు పనికి వెళ్లి తిరిగి రాలేదని కవిత చెప్పింది. కవితపై అనుమానం వచ్చి సాయిలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. సాయిలు హత్య ఉదంతం బయటపడింది.
►ALSO READ | హోదా రికార్డు అసిస్టెంట్.. చేసేది చైన్మెన్ పని.. తీసుకునే జీతమూ ఎక్కువే.. చందానగర్సర్కిల్లో ఆఫీసర్ల ఇష్టారాజ్యం