ఉప్పల్ లో దారుణం : ప్రైవేట్ స్కూల్ లో చిన్నారిపై.. బాలుడు లైంగిక దాడి

ఉప్పల్ లో దారుణం : ప్రైవేట్ స్కూల్ లో చిన్నారిపై.. బాలుడు లైంగిక దాడి

హైదరాబాద్ సిటీలో దారుణం. ఉప్పల్ లోని ప్రైవేట్ స్కూల్ అయిన లిటిల్ ప్లవర్ లో 9వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడి చేశాడు ఓ బాలుడు. క్లాస్ రూంలోనే ఈ దాడి జరిగినట్లు ఆ చిన్నారి చెబుతోంది. ఈ విషయం 2024, ఆగస్ట్ 2వ తేదీ వెలుగులోకి రావటం సంచలనంగా మారింది. విషయం తెలిసిన చిన్నారి పేరంట్స్ స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు.

స్కూల్ లో ఇంత జరుగుతుంటే టీచర్లు ఏం చేస్తున్నారంటూ చిన్నారి పేరంట్స్, బంధువులు నిలదీస్తున్నారు. లైంగిక దాడి చేసిన బాలుడి వివరాలను స్కూల్ యాజమాన్యం రహస్యంగా ఎందుకు ఉంచుతుందని ప్రశ్నిస్తున్నారు.

విషయం తెలిసిన పోలీసులు లిటిల్ ఫ్లవర్ స్కూల్ కు చేరుకుని విచారణ చేస్తున్నారు. టీచర్లతో మాట్లాడుతున్నారు. బాలుడి వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. సున్నితమైన అంశం కావటంతో.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్కూల్ గేట్లను మూసివేశారు.