సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ టీచర్కు హెచ్ఐవీ పాజిటివ్.. మహిళతో సహజీవనం.. ఆమె ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం

సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ టీచర్కు హెచ్ఐవీ పాజిటివ్.. మహిళతో సహజీవనం.. ఆమె ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం
  • పోలీసులకు ఫిర్యాదు, పోక్సో కేసు నమోదు
  • సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం

సూర్యాపేట, వెలుగు : ఓ ప్రభుత్వ టీచర్‌‌‌‌‌‌‌‌.. మహిళతో సహజీవనం చేస్తూ, ఆమె ఇద్దరు కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడికి హెచ్‌‌‌‌‌‌‌‌ఐవీ పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా తేలడం, కూతుళ్లపై అత్యాచారం విషయం బయటపడడంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో టీచర్‌‌‌‌‌‌‌‌పై పోక్సో కేసు నమోదు అయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో టీచర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. ఇతడి భార్య కొన్నేండ్ల కింద చనిపోయింది. తర్వాత సూర్యాపేటకే చెందిన, భర్తతో విడిపోయిన ఓ మహిళతో 2018లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో 19, 15 ఏండ్లు ఉన్న మహిళ ఇద్దరు కూతుళ్లపై రెండేండ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.

అయితే ఇటీవల సదరు టీచర్‌‌‌‌‌‌‌‌ బ్లడ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయించుకోగా హెచ్‌‌‌‌‌‌‌‌ఐవీ పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా తేలింది. ఈ విషయం తెలియడంతో పాటు, తమపై అత్యాచారం చేశాడని ఇద్దరు అమ్మాయిలు తల్లికి చెప్పడంతో ఆమె గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు టీచర్‌‌‌‌‌‌‌‌పై పోక్సో కేసు నమోదు చేశారు. తల్లీ ఇద్దరు కూతుళ్లకు సైతం హెచ్‌‌‌‌‌‌‌‌ఐవీ టెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు శాంపిళ్లు సేకరించారు.