
ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు..బటర్ స్కాచ్, చాక్లెట్, వెనిల్లా, స్ట్రాబెర్రీ వంటి రకరకాల ఐస్ క్రీములు మార్కెట్ అందుబాటులో ఉన్నాయి.ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వారు ఇష్టంగా తింటుంటారు. అయితే కొన్నికొన్ని సార్లు ఐస్ క్రీమ్ లు రుచిగా లేకపోవడం, నాణ్యతా లోపం, అపరిశుభ్రంగా ఉండటం వంటి సమస్యలు ఆందోళన కలిగిస్తుంటాయి. సోషల్ మీడియాలో ఇటువంటి సమస్యలను హైలైట్ చేస్తే అనేక వీడియాలు మనం చూస్తున్నాం.. అయితే ఇటీవల వెలుగు చూసిన ఐస్ క్రీమ్ కు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ చాలా దారుణంగా ఉంది. ఐస్ క్రీమ్ మధ్యలో ఫ్రీజ్ అయిన పాము కనిపించింది. దీంతో బెంబేలెత్తిపోయిన వ్యక్తి.. తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేశాడు.
థాయిలాండ్‌లోని ముయాంగ్ రాట్చబురిలోని పాక్ థో ప్రాంతంలో ఈ ఐస్ క్రీమ్ లో పాముల ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ స్ట్రీట్ వెండర్ దగ్గర రేబాన్ నక్లెంగ్‌బూన్ అనే వ్యక్తి తాను కొనుగోలు చేసిన ఐస్ క్రీమ్ లోపల గడ్డకట్టిన పామును కనుగొన్నాడు. నలుపు,పసుపు రంగు పాము లోపల ఐస్ క్రీం స్టిక్ యొక్క రెండు చిత్రాలను అతను ఫేస్‌బుక్‌లో పంచుకున్నాడు.
ఈ పోస్ట్ కు థాయ్ భాషలో ఓ క్యాప్షన్ ఇచ్చాడు. బ్లాక్ బీన్ ఐస్ క్రీమ్ థాయ్ లాండ్ లో చాలా ఫేమస్.. ఇందులో ఇలాంటి పాములు వస్తాయని ఎవరైనా ఊహించారా అంటే రాశాడు.
ALSO READ | వరంగల్ జిల్లాలో విషాదం.. ఎస్సారెస్పీ కెనాల్లోకి దూసుకెళ్లిన కారు
ఫేస్ బుక్ లో ఈ పోస్ట్ వైరల్ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. పాప్సికల్ లోపల ఉన్న పాము గోల్డెన్ ట్రీ స్నేక్ (క్రిసోపెలియా ఆర్నాటా) అని చాలా మంది యూజర్లు భావించారు.ఈ ప్రాంతంలో కనిపించే తక్కువ విషపూరితమైన జాతి పాము. ఐస్ క్రీంలో ఉన్న పాము కేవలం చిన్న పాము అని ఇది 20 ,40 సెం.మీ మధ్య ఉంటుంది.. అయితే పూర్తిగా పెరిగిన గోల్డెన్ ట్రీ స్నేక్ 70 నుంచి130 సెం.మీ పొడవు ఉంటుందని కొందరు రాశాడు. ఏదీ ఏమైనా ఐస్ క్రీమ్ లో పాము ఉండటంపై కామెంట్స్ బాక్సు మొత్తం నిండిపోయింది.
ప్రోటీన్ జోడించిన కొత్త ఫార్ములా ఐస్ క్రీమ్ అంటూ ఓ నెటిజన్ రాశాడు. పాములు బయటికి వచ్చే ఐస్ క్రీమ్ అంటూ మరో నెటిజన్.. అది నిన్న మొదట కాటేస్తుందంటూ మరో నెటిజన్.. ఇలా హాస్యాస్పదమైన కామెంట్లతో బాక్సు నిండిపోయింది.
ఏదీ ఏమైనా మనం తినే ఆహార పదార్ధాలను ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది అంటూ కొందరు నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.