హైదరాబాద్ సిటీలో వారం రోజుల క్రితం జరిగిన హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూసీ నదిలో దొరికిన తలతో.. తీగలాగగా డొంక కదిలింది. ఇది కేవలం హత్య మాత్రమే కాదు.. అంతకు మించి ఘోరం అని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. హత్యకు గురైన మహిళను అనురాధకు గుర్తించిన పోలీసులు.. ఆమె ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నట్లు గుర్తించారు. తల సరే.. మరి మిగతా శరీరం ఏమైందీ అని విచారించిన పోలీసులు.. విషయం తెలిసి వణికిపోయారు.
అనురాధను హత్య చేసింది ఆమె నివాసం ఉంటున్న ఇంటిపైనే ఉంటుంది. ఒంటరిగా జీవిస్తుంది. నిందితుడు చంద్రమోహన్ కు ఏడు లక్షల రూపాయలు అప్పు ఇచ్చింది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడగటంతో.. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లోనే అనురాధను హత్య చేసిన చంద్రమోహన్.. తలను మూసీనదిలో పడేయగా.. మిగతా శరీరాన్ని కూరగాయలు కోసినట్లు.. ముక్కలు ముక్కలుగా నరికేశాడు. శరీర భాగాల ముక్కలను ఇంట్లోని ఫ్రిజ్ లోనే.. కవర్లలో దాచి పెట్టాడు. ప్లాస్టిక్ కవర్లలో దాచిన శరీరం భాగాల ముక్కలను సిటీలోని కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో పడేసినట్లు చెబుతున్నారు పోలీసులు.
ఇంత ఘోరమైన పనిని చంద్రమోహన్ ఒక్కడే చేశాడా లేక అతనికి ఇంకెవరైనా సహరించారా అనేది ఇంకా వెల్లడించలేదు పోలీసులు. సీన్ రీ కనర్ స్ట్రక్షన్ చేసిన పోలీసులు.. అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. అప్పించిన పాపానికి అనురాధను అడ్డంగా నరికేయటంతోపాటు.. ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచటం అనేది హైదరాబాద్ సిటీలో సంచలనంగా మారింది.