చాలామందికి ఫొటో పిచ్చి ఉంటుంది.. నచ్చిన ప్రదేశాలు..నదులు..కొండలు.. హిస్టారికల్ ప్లేసెస్.. ఇలా మనుసుకు నచ్చిన చొటల్లా ప్రకృతి ఎక్కడ అందంగా, మనోహరంగా కనిపిస్తే అక్కడా ఫొటో షూట్ పెడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొందరు ఫొటోల మోజులో పడి చుట్టు పక్కల ఏం జరుగుతుందో పట్టించుకోనంతగా ఇన్వాల్వ్ అవుతుంటారు.. ఎంజాయ్ చేయడం తప్పుకాదుగానీ.. ఒళ్లు మరిచి ఉండటం మంచిది కాదని ఈ ఇన్సిడెంట్ చెపుతుంది.. రాజస్థాన్ లోని పాలీ వద్ద ఓ హెరిటేజ్ బ్రిడ్జీ పై ఫొటోలు దిగుతూ రైలు వచ్చే గమనించక ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. ఆదివారం (జూలై 14) మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ లేని పాలి వద్ద గోర్మ్ ఘాట్ పురాతన రైల్వే బ్రిడ్జి ఉంది.ఇక్కడ ప్రకృతి చాలా అందంగా, కనుల విందు చేస్తుండటంతో ఇక్కటి చాలా మంది సందర్శకులు వస్తుంటారు. ఆదివారం రాజస్థాన్ లోని బాగ్దీ నగర్ కు చెందిన కొత్త జంట రాహుల్ మేవాడ(22), అతని భార్య జాహ్నవి(20) లు పాలీ వద్ద పురాతన రైల్వే బ్రిడ్జి దగ్గర ఫోటోలు దిగుతుండగా బ్రిడ్జి పైనుంచి లోయలో పడ్డారు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ALSO READ | నదిలో పడి కొట్టుకుపోయిన బస్సులు 65 మంది గల్లంతు
రాహుల్ మేవాడ, అతని భార్య జాహ్నవి, చెల్లెలు, బావతో కలిసి పాలి పురాతన రైల్వే బ్రిడ్జి వద్దకు విహార యాత్రకు వచ్చారు. సరదాగా రైల్వే బ్రిడ్జిపై ఫొటోలు దిగాలనిపించి.. మీటర్ గేజ్ ట్రైన్ ట్రాక్ పై స్టిల్స్ ఇచ్చి ఫొటోలుదిగుతున్నారు..రాహుల్, అతని భార్య ఒకరినొకరు కౌగలించుకొని నిలబడ్డారు. ఇంతలో రైలు వారిపైకి దూసుకొచ్చింది. ఇది గమనించిన రాహుల్ చెల్లెలు, బావ తప్పించు కొని పక్కకు వచ్చారు. రైలు రాకను గమనించని రాహుల్, జాహ్నవి భయంతో లోకలో దూకారు..రాహుల్, జాహ్నవి లు ప్రస్తుతం చికిత్సపొందుతున్నారు. కాని వారి పరిస్థితి క్రిటికల్ గానే ఉందం టున్నారు డాక్టర్లు.
ఈ ఘటనపై స్పందించిన అజ్మీర్ రైల్వే డివిజన్ అధికారులు మాట్లాడుతూ.. లోకో పైలట్ ట్రైన్ బ్రేకులు వేశారు.. ఘటనా స్థలానికి చేరుకోగానే రైలు ఆగిపోయింది.. అయితే బాధుతులు రాహుల్, జాహ్నవి భయంతో లోయలో దూకారు.. వారికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు.
ఏదీ ఏమైనా ఎంజాయ్ చేయాలనుకోవడం తప్పుకాదు.. కానీ ఒళ్లు మరిచి ఉండొద్దని అంటున్నారు ఈ వీడియో చూసినవారంతా..బీకేర్ ఫుల్..