
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని పండ్ల మార్కెట్‌లో అప్పు చెల్లించలేదని ఓ వ్యాపారిని, ఓ వ్యక్తి వివస్త్రను చేసి ఊరేగించారు. రూ.3వేల వివాదంపై కోపంతో చెలరేగిపోయిన రుణదాత అయిన సుందర్ అనే వ్యక్తి.. అమిత్ అనే వ్యాపారిని బలవంతంగా వివస్త్రను చేశాడు. ఈ సంఘటనను సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ వీడియోలో కనిపించిన సంఘటన నోయిడా ఫేజ్ 2 మార్కెట్‌లో జరిగినట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం, అమిత్.. సుందర్ వద్ద నెల క్రితం రూ.5వేల 600 అప్పుగా తీసుకున్నాడు. సెప్టెంబర్ 19న అమిత్.. అప్పులోని రూ.2వేల 500ను తిరిగి ఇచ్చేశాడు. మిగిలిన మొత్తాన్ని మళ్లీ చెల్లిస్తానని అభ్యర్థించారు. కానీ దానికి అంగీకరించని సుందర్.. కోపంతో అతన్ని వివస్త్రను చేసి బహిరంగంగా ఊరేగించాడు.
ALSO READ : బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన కొద్దిసేపటికే, సిటీ మేజిస్ట్రేట్ ఆక్రమణదారుడి లైసెన్స్‌ను రద్దు చేశారు. ఫేజ్ 2 పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఈ కేసుపై సంబంధించిన సిటీ మేజిస్ట్రేట్ ధర్మేంద్ర కుమార్.. సుందర్ ఫేజ్ 2లో తన దుకాణాన్ని చాలా కాలంగా నడుపుతున్నాడని, ఘటనపై సమాచారం అందిన వెంటనే అతని లైసెన్స్‌ను రద్దు చేశామని చెప్పారు.
नोएडा में क्रूरता की पराकाष्ठा
— Priya singh (@priyarajputlive) September 19, 2023
लहसुन बेचने वाले युवक 5100 रुपए उधार लिए थे। 3100 रुपए बाकी रह गए थे। इसी बात पर उधार देने वाले ने युवक को नंगा करके मंडी में घुमाया। pic.twitter.com/0LvXkhCUgP