శవం అంటేనే ఓ రకమైన భయం.. ఉద్వేగం.. ఆవేదన.. ఓ మృతదేహం పక్కన ఉంటే కనిపించాల్సింది జీవిత సత్యం.. ఓ మృతదేహం పక్కన ఉంటే వచ్చే ఆలోచన జీవితం అంటే ఇదే కదా.. ఎవరూ శాశ్వతం కాదు కదా అని.. ఓ మృతదేహం పక్కన ఉంటే ఓ రకమైన ఫీలింగ్.. అలాంటిది శవాల గదిలో.. పదుల సంఖ్యలో శవాలు ఉన్న పోస్టుమార్టం గదిలో.. వాళ్లు రాసలీలలు చేస్తున్నారు.. చక్కగా సరసాలు ఆడుకుంటున్నారు.. అంతేనా తమ సరసాలను.. తమ చిలిపి పనులను ఎంచక్కా వీడియోలు తీసుకుంటున్నారు.. ఇది ఎక్కడో జరిగింది కాదు.. మన నోయిడాలో.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో వివరాలు ఇలా ఉన్నాయి...
Also Read:-క్రైం సీన్ మార్చేశారు.. ఆత్మహత్య అని చెప్పారు.. అంత్యక్రియల తర్వాత FIR
నోయిడాలోని సెక్టార్ 94లోని ఓ హాస్పిటల్ కి సంబంధించిన పోస్టుమార్టం గదిలో ఓ వ్యక్తి మహిళతో సరసాలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఉన్న వ్యక్తి స్వీపర్ అని తెలుస్తోంది. ఈ వీడియోను అతని కొలీగ్ షూట్ చేసాడు, అతను డైరెక్షన్లు ఇస్తున్నట్లు వీడియోలో క్లియర్ గా తెలుస్తోంది. మార్చురీలో, అందులోనూ పక్కనే స్ట్రెచర్ పై శవాన్ని పెట్టుకొని ఇలాంటి పని చేయటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
नोएडा के पोस्टमार्टम हाउस में देह व्यापार का धंधा
— Abhishek Tyagi (@abhishek03tyagi) August 22, 2024
नोएडा के पोस्टमॉर्टम हाउस में महिला के साथ आपत्तिजनक स्थित में मिला सफाईकर्मी, शव के पास महिला से बनाए शारीरिक संबंध, वीडियो सोशल मीडिया पर वायरल। @dmgbnagar @brajeshpathakup @CMOfficeUP #Noida pic.twitter.com/BN9TmBphP6
సాధారణంగా పోస్టుమార్టం విభాగంలో మహిళలు పనిచేయరు కాబట్టి వీడియోలో ఉన్న మహిళ బయటి వ్యక్తి అయ్యుండే అవకాశం ఉంది. సదరు మార్చురీలో భద్రత ఎంత పేలవంగా ఉందో ఈ సంఘటనను బట్టి చెప్పచ్చని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అంతే కాదు, ఈ ఘటన వ్యభిచార రాకెట్లో భాగమా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా సమాజంలో రోజురోజుకీ పెరుగుతున్న విచ్చలవిడి తనానికి, దిగజారుతున్న విలువలకు ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తుంది.
.