
అమెరికాలోని వాషింగ్టన్ ఏవ్ లో జరిగిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతిచెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా.. హైదరాబాద్ కు చెందిన రవితేజ చనిపోయాడు. చైతన్య పురి పరిధిలోని అర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెం. 2 నివాసం ఉంటున్న కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజ.
2022 మార్చిలో అమెరికాకు వెళ్లిన రవితేజ.. మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రవితేజ మృతితో అర్కేపురంలోని అతని నివాసంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రవితేజ మృతి,కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.