అమెరికాలో కాల్పుల కలకలం

లాస్ ఏంజెల్స్: అమెరికాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఓ దుండగుడు ముగ్గురిని చంపి తానూ కాల్చుకున్నాడు. శనివారం లాస్ ఏంజెల్స్ లోని  గ్రెనడా హిల్స్ లో ఈ దుర్ఘటన జరిగింది. లెర్డో అవెన్యూలో బ్లాక్ 11600లో కాల్పులు జరుగుతున్నాయని పోలీసులకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వాళ్లు అక్కడికి వెళ్లి తలుపు తట్టగా స్పందన లేదు. దీంతో పోలీసులు బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో కాల్పుల నుంచి బయటపడిన ఓ వ్యక్తి.. మృతి చెందిన ముగ్గురిని పోలీసులకు చూపించారు. ఇంటిలో 85 ఏండ్ల పైబడి వయస్సు ఉన్న ఓ  వ్యక్తే కాల్పులు జరిపి తర్వాత తానూ కాల్చుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.