మణిపూర్‎లో బిహార్ కూలీల కాల్చివేత

మణిపూర్‎లో బిహార్ కూలీల కాల్చివేత

గువాహటి: అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‎లో బిహార్ కూలీలు ఇద్దరిని దుండగులు కాల్చి చంపారు. శనివారం అర్ధరాత్రి మైతీల ప్రాబల్యమున్న కాక్చింగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బిహార్‎లోని గోపాల్ గంజ్ జిల్లాకు చెందిన సునాలాల్ కుమార్(18), దశరథ్ కుమార్(17) కాక్చింగ్ జిల్లాలో భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. శనివారం సాయంత్రం పనికి వెళ్లివస్తుండగా కాక్చింగ్– వాబగై రోడ్డులో దుండగులు వారిని కాల్చి చంపారు. కాగా, మణిపూర్‎లో తమ రాష్ట్ర కూలీలు హత్యకు గురవడంపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.