రాయికల్, వెలుగు: జగిత్యాల జిల్లా రాయి కల్లో శనివారం సాయంత్రం బంగారం కొనేందుకు వచ్చిన ఇద్దరు దొంగలు.. షాపు యజమానిపై మత్తు మందు చల్లి రెండున్నర తులాల బంగారం, రూ.15వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. పట్టణంలోని ఇటిక్యాల క్రాసింగ్ వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ జ్యవెల్లర్స్కు శనివారం సాయంత్రం ఇద్దరు వచ్చారు.
తమ ఇంట్లో శుభకార్యం ఉందని, బంగారం కావాలంటూ షాపు యజమాని ప్రసాద్‌ను మాటల్లో పెట్టారు. ఆయన బంగారం ఇస్తుండగా మత్తు స్ప్రే చేశారు. మత్తులోకి జారుకోవడంతో దుకాణంలోని 2.5 తులాల బంగారం, రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లారు. యజమాని 20 నిమిషాల తర్వాత మత్తు నుంచి తేరుకొని చూడగా బంగారంతో పాటు నగదు కనిపించలేదు. అదే రాత్రి పీఎస్‌లో ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.