
రాత్రి టైంలో రోడ్డు పక్కన కారు పార్కింగ్‌చేసిన తర్వాత డోర్ తీయాలంటే ఒకటికి రెండు సార్లు వెనుక నుంచి వెహికల్స్ వస్తున్నాయా ? అని చెక్ చేసుకుంటుంటాం. అయినా.. అలా కారు డోర్లు తీస్తున్నప్పుడు చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. కానీ.. ఇలాంటి లైట్లను డోర్లకు బిగించుకుంటే.. చాలావరకు ప్రమాదాలను అరికట్టవచ్చు. సార్టే అనే కంపెనీ ఈ లైట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటిని కారు డోర్లకు లోపలి భాగంలో ఇన్స్టాల్చేసుకోవాలి. వీటికి ప్రత్యేకంగా బ్యాటరీ వైరింగ్స్అవసరం లేదు. ఇన్‌బిల్ట్‌గా వచ్చే సీఆర్ 2032 బ్యాటరీతో పనిచేస్తుంది.
ఇది కార్లతో పాటు ఎస్యూవీ, ట్రక్కులకు కూడా సరిపోతుంది. వీటిని ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. లైట్కి వెనుక భాగంలో ఉండే స్టిక్కర్‌ని తీసేసి డోర్‌కి అతికిస్తే సరిపోతుంది. ఇందులో 3 ఫ్లాషింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ లైట్లు వాటర్ ఫ్రూఫ్‌తో వస్తున్నాయి. నీటిలో 30 నిమిషాలు ఉన్నా పనిచేస్తాయి. కాబట్టి వర్షం కురిసినప్పుడు పాడైపోతాయేమో అనే భయం అక్కర్లేదు. ఇందులో ఉండే హై-టెక్ సెన్సింగ్ చిప్ వల్ల డోర్ తీయగానే ఆటోమెటిక్‌గా లైట్లు ఆన్ అవుతాయి. డోర్మూసేయగానే ఆఫ్అయిపోతాయి.
ధర: రూ. 345