హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం..ఏం జరిగిందంటే..

హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం..ఏం జరిగిందంటే..

హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. గుడిమల్కాపూర్లోని కింగ్స్ ప్యాలెస్లో ఆనం మీర్జా ఎక్స్పోలో ఓ షాప్కీపర్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఇద్దరు షాపు కీపర్ల మధ్య గొడవ తలెత్తడంతో ఓ షాపు కీపర్ తనవద్ద ఉన్న తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కాల్పులు ఎలా జరిగాయో విచారణ చేపట్టారు. తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.