![మద్దులపల్లి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం](https://static.v6velugu.com/uploads/2025/02/shopping-begins-at-maddulapalli-market_LneirjuxbN.jpg)
ఖమ్మం రూరల్, వెలుగు : మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్లో బుధవారం మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకుడు ఆర్.లక్ష్మణుడు ప్రారంభించారు. మొదటి రోజు కూసుమంచి మండలం పోచారం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు తాలు రకం మిర్చి తీసుకురాగా క్వింటాకు రూ.7200 చొప్పున ధర పలికింది. ఖమ్మం మార్కెట్కు ఒక్కరోజే లక్ష బస్తాల మిర్చి రావడంతో అక్కడ చోటు లేక రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్అధికారులను మద్దులపల్లిలో కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా తొలుత మార్కెట్లోకి పంట తీసుకువచ్చిన రైతు వెంకటేశ్వర్లును వ్యాపారులు, అదనపు సంచాలకులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎంవో ఆలీం, ఖమ్మం మార్కెట్ఎస్జీఎస్ ప్రవీణ్ కుమార్, ఈఈ ఎల్లేశ్, టెక్నికల్ కన్సల్టెంట్ రావి ఉమామహేశ్వరరావు, మద్దులపల్లి మార్కెట్సెక్రటరీ ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.