
- సిద్దిపేటలో రూ.31 వేల ఫైన్వేసిన అధికారులు
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేటలోని రెండు షాపింగ్ మాల్స్ యజమానులు బల్క్ వేస్ట్ ను మున్సిపల్ చెత్త బండికి ఇవ్వకుండా సెల్లార్ లో స్టోర్ చేస్తుండడంతో గురువారం మున్సిపల్ సిబ్బంది భారీ జరిమానా విధించారు. పాత మార్కెట్ లోని మాంగళ్య షాపింగ్ మాల్ లో బల్క్ వేస్ట్ ను సెల్లార్ లో వేస్తుండడంతో సానిటరీ ఇన్స్పెక్టర్సతీశ్రూ.15వేల జరిమానా వేశారు.
అలాగే మెదక్ రోడ్డు లోని రిలయన్స్ స్మార్ట్ సెల్లార్ లో భారీగా చెత్త పేరుకుపోవడంతో సానిటరీ ఇన్స్పెక్టర్వనిత రూ.16 వేల ఫైన్ వేశారు.