ప్లాస్టిక్‌‌ అమ్ముతున్న షాపులు సీజ్‌‌

హనుమకొండ, వెలుగు : వరంగల్‌‌ నగరంలో సింగిల్‌‌ యూజ్‌‌ ప్లాస్టిక్‌‌ అమ్ముతున్న పలు షాపులు మున్సిపల్‌‌ ఆఫీసర్లు శనివారం సీజ్‌‌ చేశారు. వరంగల్‌‌లోని పిన్నవారి స్ట్రీట్, బీట్‌‌ బజార్‌‌ తదితర ఏరియాల్లో సింగిల్‌‌ యాజ్‌‌ ప్లాస్టిక్‌‌ అమ్ముతున్నారని, గుట్టుచప్పుడు కాకుండా మేడారం తరలిస్తున్నారని ఈ నెల 8న ‘వెలుగు’ పేపర్‌‌లో పబ్లిష్‌‌ అయిన స్టోరీకి ఆఫీసర్లు స్పందించారు.

చీఫ్‌‌ మున్సిపల్‌‌ హెల్త్‌‌ ఆఫీసర్‌‌ రాజేశ్‌‌ శనివారం పిన్నవారి స్ట్రీట్, బీట్‌‌ బజార్‌‌లోని పలు షాపులను తనిఖీ చేశారు. ప్లాస్టిక్‌‌ అమ్ముతున్న 8 షాపులను గుర్తించి వాటిని సీజ్‌‌ చేయడంతో పాటు, సుమారు రూ.1.03 లక్షల పెనాల్టీ విధించారు. సింగిల్‌‌ యూజ్‌‌ ప్లాస్టిక్‌‌ అమ్మే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో శానిటరీ సూపర్‌‌వైజర్లు సాంబయ్య, నరేందర్, శానిటరీ ఇన్స్‌‌పెక్టర్‌‌ సంపత్‌‌రెడ్డి పాల్గొన్నారు.