హైదరాబాద్, వెలుగు: ఫ్లిప్‌కార్ట్ వాల్యూ ఈ–-కామర్స్ ప్లాట్‌ఫామ్ షాప్సీ బిగ్ దీపావళి సేల్‌ని నిర్వహిస్తోంది. ఇది అక్టోబర్ 21న ప్రారంభమయింది. ఫ్యాషన్, హోమ్ డెకర్, ఎలక్ట్రానిక్స్‌తో సహా ఎన్నో ప్రొడక్టులపై ఈ సందర్భంగా డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తున్నామని ప్రకటించింది. వేలాది ప్రొడక్టులపై 50శాతం వరకు తగ్గింపును పొందవచ్చని తెలిపింది.
గోల్డ్ ఉత్సవ్ ఛాలెంజ్ ద్వారా కస్టమర్లు బంగారు, వెండి నాణేలను గెలుచుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. పండుగ కోసం ప్రత్యేక దుస్తులు, గృహాలంకరణ, బహుమతి వస్తువులను అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. పండుగ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి వినియోగదారుల సంఖ్య 70 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు షాప్సీ ప్రకటించింది.