శ్రీశైలం డ్యామ్​12వ గేట్​ వద్ద షార్ట్​ సర్క్యూట్

శ్రీశైలం డ్యామ్​12వ గేట్​ వద్ద షార్ట్​ సర్క్యూట్
  • అన్ని గేట్లకు కరెంట్​సప్లై నిలిపివేత

శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం డ్యామ్​12వ గేట్​వద్ద సోమవారం సాయంత్రం 4.30గంటలకు భారీ శబ్దం వచ్చింది. ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో అక్కడి సిబ్బంది భయాందోళనతో పరుగులు తీశారు. గంట తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్​ఫోర్స్​సిబ్బంది వెళ్లి పరింశీలించారు. 12వ గేట్​డ్యామ్ ఛేంజ్​ఓవర్​స్విచ్​వద్ద షార్ట్​సర్క్యూట్ జరిగినట్లు గుర్తించారు. డ్యామ్ అధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే అన్ని గేట్లకు కరెంట్​సప్లై నిలిపివేశారు. సున్నిపెంట, లింగాలగట్టు ప్రాంతాలకు కూడా సప్లై ఆగింది. షార్ట్​సర్క్యూట్​జరిగిన 12వ గేట్ వద్ద రిపేర్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం లోపు సప్లైను పునరుద్ధరిస్తామని 
ఆఫీసర్లు తెలిపారు.