హనుమాపూర్ 220 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హనుమపూర్ లోని విద్యుత్ సబ్ స్టేషన్ లో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షాట్ సర్య్కూట్ కారణంగా  220 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ లో  పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపి వేసి అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.  రెండు ఫైర్ ఇంజన్లతో ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ మెన్లు మంటలను మార్పారు. షాట్ సర్య్కూట్ కారణాలు తెలియదు. వెంటనే విద్యుత్ శాఖ అధికారుల స్పందించడంతో భారీ ప్రమాదం, ఆస్తి నష్టం నివారించగలిగారు.