బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం..

ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఎండలు 45డిగ్రీలు దాటిపోతున్నాయి. ఈ ఏడాది 50డిగ్రీలు చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎండ వేడికి తట్టుకోలేక జనం ఇంటి నుండి బయటకు రావటం చాలా వరకు తగ్గించేశారు. అత్యవసరమైతే తప్ప బయట అడుగుపెట్టడం లేదు. తప్పనిసరైన పరిస్థితిలో బయట తిరుగుతున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. ఎండ తీవ్రత వల్ల వడదెబ్బకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. మరో పక్క ఎండల దాటికి బస్సులు కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి.

విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల బస్సుల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో షార్ట్ సర్క్యూట్ వల్ల బస్సులో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో తృటిలో ప్రమాదం తప్పింది. బస్సుకు సమీపంలో ఉన్న పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేయటంతో పెను ప్రమాదం తప్పింది.