జగిత్యాలలో షార్ట్ సర్క్యూట్.. రూ.20 లక్షల ఆస్తి నష్టం

జగిత్యాలలో షార్ట్ సర్క్యూట్.. రూ.20 లక్షల ఆస్తి నష్టం

జగిత్యాల జిల్లాలోని  ఓ మిల్లులో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో  రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎండమల్లి మండలం అంబారీ పేట్ గ్రామ శివారులో శ్రీ రామరైస్ మిల్ ల్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. 

స్థానికులు గమనించి ఫైర్ ఇంజిన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటనలో సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. పక్కనే మరో రెండు రైస్ మిల్స్, భారీగా ధాన్యం నిల్వలు ఉన్నాయి. సకాలంలో అప్రమత్తం కాకపోయింటే ప్రమాద తీవ్రత పెరిగేదని స్థానికులు అంటున్నారు.