
ఇండియన్ ఆర్మీ 62వ, 33వ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కోర్సులో అడ్మిషన్స్‌కు సంబంధించి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
62వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) పురుషులు: 175 పోస్టులు, 33వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మహిళలు: 19, ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ టెక్: 1, ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ నాన్-టెక్: 1 పోస్టు ఖాళీగా ఉన్నాయి.
అర్హత: బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను షార్ట్‌లిస్ట్, స్టేజ్-1, స్టేజ్-2 ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ఏప్రిల్ 2024లో ప్రారంభం అవుతుంది. పూర్తి సమాచారం కోసం www.joinindianarmy.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.