హైదరాబాద్, వెలుగు: వాస్తవాలను ధృవీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసిన ఓయూ చీఫ్ వార్డెన్ కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఓయూలో విద్యుత్తు, తాగునీటి కొరత ఉందని మే 1 నుంచి మే31వరకు సెలవులు ఇస్తూ చీఫ్ వార్డెన్ ఓ ప్రకటన చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూలో కరెంటు, వాటర్ కొరత అవాస్తవమని చెప్పారు
నీటి కొరతకు ఇదే నిదర్శనం: కేసీఆర్ ట్వీట్
ఓయూలో విద్యుత్, తాగునీటి సరఫరాపై సీఎం, డిప్యూటీ సీఎం 4 నెలలుగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం ట్వీట్ చేశారు. చీఫ్ వార్డెన్ కు జారీ చేసిన షోకాజ్ నోటీసులే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఓయూ హాస్టళ్లకు సెలవులు రద్దు
వర్సిటీ హాస్టళ్లకు మే 1 నుంచి 30వరకు ఇచ్చిన వేసవి సెలవులను ఓయూ అధికారులు రద్దు చేశారు. మంగళ వారం నుంచి హాస్టళ్లు, మెస్‌లు యధావిధిగా పనిచేస్తాయన్నారు.