బీహార్‎లో అంతే: పరీక్షల్లో పేపర్ చూపించలేదని.. ఫ్రెండ్‎ను కాల్చి చంపిన తోటి స్టూడెంట్

బీహార్‎లో అంతే: పరీక్షల్లో పేపర్ చూపించలేదని.. ఫ్రెండ్‎ను కాల్చి చంపిన తోటి స్టూడెంట్

పాట్నా: పరీక్షలో ఆన్సర్స్ చూపించలేదని ఓ పదవ తరగతి స్టూడెంట్ తన క్లాస్ మేట్‎ను దారుణంగా కాల్చి చంపాడు. ఈ షాకింగ్ ఘటన బీహార్‎లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రోహ్తాస్ జిల్లాకు చెందిన అమిత్ కుమార్, సంజిత్ కుమార్ పదవ తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న టెన్త్ బోర్డు ఎగ్జామ్‎లో తనకు ఆన్సర్స్ చూపించాలని అమిత్ కుమార్, సంజిత్ కుమార్‎ను అదే క్లాస్‎కు చెందిన మరో బాలుడు కోరాడు. అందుకు అమిత్ కుమార్, సంజిత్ కుమార్ నిరాకరించారు.

ఈ విషయంలో ముగ్గురు మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకున్న బాలుడు.. గురువారం (ఫిబ్రవరి 20) సోషల్ ఎగ్జామ్ రాసి అమిత్ కుమార్, సంజిత్ కుమార్ ఇంటికి వెళ్తుండగా వీరిపై కాల్పులు జరిపి పారిపోయాడు. గమనించిన స్థానికులు అమిత్, సంజిత్‎ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అమిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. సంజిత్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. 

Also Read :- లిఫ్ట్లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడి మృతి

పోలీసులు దర్యాప్తులో మైనర్ బాలుడు కీలక విషయాలు వెల్లడించారని పోలీసులు తెలిపారు. పరీక్షలో సమాధానం చూపించలేదని తన ఫ్రెండ్స్‎ను హత్య చేయలేదని.. వారు గత ఏడాదిగా తనను వేధిస్తున్నారని.. అందుకే హత్య చేసినట్లు నిందితుడు పేర్కొన్నాడు. బాలుడు హత్యకు ఉపయోగించిన తుపాకీ ఎక్కడ నుంచి తీసుకొచ్చాడనే దానిపై పోలీసులు ఆరా తీశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని.. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.