బీఆర్​ఎస్​ ప్రభుత్వం అన్యాయం చేసింది..

 

  • అగ్రికల్చర్ ​ఆఫీసర్లకు ప్రమోషన్లు కల్పించాలి
  • అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ చైర్మన్ బి.కృపాకర్ రెడ్డి 

ముషీరాబాద్, వెలుగు: పదేండ్ల పాలనలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బందికి పదోన్నతులు కల్పించకుండా బీఆర్ఎస్​అన్యాయం చేసిందని తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ చైర్మన్ బి.కృపాకర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా పదోన్నతులు చేపట్టాలని కోరారు. వ్యవసాయ శాఖతోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే మూలాధారమని చెప్పారు. ఆదివారం తన ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో తిరిగే అధికారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రైతులను కలిసేందుకు వీలుగా వాహన సౌకర్యం కల్పించాలన్నారు.