- కార్మికులకు ప్రతి నెలా వేతనాలు ఇవ్వాలి
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వ విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో స్టూడెంట్స్కు అనుగుణంగా తాగునీటి వసతి కల్పించాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. శనివారం తాగునీటి సమస్యలపై ఆర్డబ్ల్యూఎస్ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ మనోజ్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ రఘువీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు విజయ లక్ష్మి, నాగభూషణం, సంపత్, పాషా, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు వెంటనే తాగునీటి సరఫరా కనెక్షన్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
రెసిడెన్షియల్ స్కూళ్లలో వాటర్ సరిపోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని వాటికి పరిష్కార మార్గం చూపాలన్నారు. వాటర్ ప్లాంట్స్, వాటర్ సప్లై కి సంబంధించిన రిపేర్లను ఎప్పటికప్పుడు చేయించాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్కు సంబంధించిన పెండింగ్ బిల్స్విడుదల చేయాలని కలెక్టర్క్రాంతికి ఫోన్ చేసి మాట్లాడారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రతి నెలా వేతనాలు చెల్లించాలన్నారు. మ్యాన్ పవర్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించి రెగ్యులర్గా వేతనాలు విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.