
కేసీఆర్ పాలనకి ఈసారి చరమ గీతం పాడాలని వైఎస్ఆర్టీపీ చీఫీ వైఎస్ షర్మిల అన్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపురెడ్డి పల్లిలో పాదయాత్ర చేస్తోన్న షర్మిల... వైఎస్సార్ హయాంలో లక్షల ఎకరాలకు పోడు పట్టాలిచ్చారన్నారు. 40 లక్షల పక్కా ఇల్లు కట్టించారన్న ఆమె వైఎస్ ఉన్నప్పుడు ప్రతీ గ్రామం కళకళలాడిందని చెప్పారు. పేద వాడి ఇంట్లో జబ్బు వస్తే అరోగ్య శ్రీ ఉందనే ధీమా ఉండేదని చెప్పారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి చేసిన మంచి పని ఏమైనా ఉంటే ఒక్కటి చెప్పాలని షర్మిల కోరారు. కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీ మోసమేన్న ఆమె... కేసీఆర్ అమలు చేస్తా అని చెప్పిన ప్రతీ పథకం అబద్దమేనని ఆరోపించారు. అంతా మోసపూరిత పాలన అని విమర్శించారు. ఇలాంటి ముఖ్యమంత్రిని మరో సారి ఎలా నమ్మాలి..? అని షర్మిల ప్రశ్నించారు.