జీహెచ్ఎంసీ వర్కర్లను రెగ్యులర్ చేయరా?

జీహెచ్ఎంసీ వర్కర్లను రెగ్యులర్ చేయరా?

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధ వారం100 మంది కార్మికులు తనను కలిసి వారి ఇబ్బందులు తెలియజేశారని ట్వీట్ చేశారు. ‘‘గ్రేటర్ హైదరాబాద్ లో 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. తెలంగాణ రాగానే వారిని రెగ్యులర్ చేస్తామని 2012లో కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ సీఎం ఆ హామీని మరిచిపోయారు.” అన్నారు..