ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

పిట్లం, వెలుగు: కాంగ్రెస్ నాయకుడు రాహుల్​గాంధీ నిర్వహిస్తున్న భారత్​జోడో యాత్రను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత షబ్బీర్ అలీ కోరారు. ఆదివారం కామారెడ్డి డీసీసీబీ ప్రెసిడెంట్​కైలాష్ శ్రీనివాస్‌‌రావు అధ్యక్షతన పిట్లంలో నిర్వహించిన యాత్ర సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్‌‌ యాత్ర నవంబర్​3న జుక్కల్ నియోజకర్గం మీదుగా మహారాష్ట్రలోకి వెళ్తుందని చెప్పారు.  దాదాపు మూడు రోజుల పాటు 65 కిలోమీటర్ల సాగే యాత్రలో ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త పాల్గొనాలని కోరారు. త్వరలో నాయకులకు యాత్ర బాధ్యతలు అప్పగిస్తామన్నారు. సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్‌‌రెడ్డి, మాజీ ఎంపీ సురేశ్‌‌ షెట్కార్, మదన్‌‌మోహన్‌‌రావు, సుభాష్‌‌రెడ్డి, గడుగు గంగాధర్, సౌదాగర్ గంగారాం, కాసుల బాలరాజు, తాహెర్​బిన్​హందాన్ పాల్గొన్నారు.

బీజేపీలో పలువురి చేరిక 

నిజాంసాగర్ (ఎల్లారెడ్డి), వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలు చూసి యువత, మహిళలు బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార చెప్పారు. ఆదివారం నిజాంసాగర్ మండల్ బూర్గుల్‌‌లో ఏర్పాటు చేసిన బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ జడ్పీ చైర్మన్ వెంకటరమణారెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు యువకులు పార్టీలో చేరారు. అనంతరం ఇటీవల తండ్రిని కోల్పోయిన తున్కిపల్లి బీజేపీ లీడర్ సాయిబాబాను పరామర్శించారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రెసిడెంట్ సాయిలు, జిల్లా లీడర్లు రాము, సాయిరెడ్డి, అభినయ్ రెడ్డి, అశోక్ రాజ్, గోలి లక్ష్మణ్, మండల మోర్చా లీడర్లు శ్రీకాంత్,నరేష్,విశ్వనాథ్‌‌, రాజు,కాశి,నవీన్ రెడ్డి పాల్గొన్నారు.  అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టు కెనాల్ డీ 1 డిస్ట్రిబ్యూటర్ నుంచి డీ 7 వరకు చేసిన లైనింగ్ వాల్ పనుల్లోనూ టీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్లు కమిషన్లు తీసుకోవడం వల్ల క్వాలిటీ లేకుండా పోయిందన్నారు. ఆమె వెంట పార్టీ జిల్లా సెక్రటరీ రాము, లక్ష్మణ్, సాయిరెడ్డి, మండల ప్రెసిడెంట్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన హామీలు అమలు చేయండి

ఆర్మూర్, వెలుగు: ‘ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌‌రెడ్డి రాజీనామా చేయనవసరం లేదు.. మంత్రి కేటీఆర్ ఆర్మూర్‌‌‌‌ను దత్తత తీసుకునే అవసరం లేదు..  గతంలో ఇచ్చిన హామీలను నెరవేరిస్తే ఆర్మూర్ దశదిశ  మారుతుంది..’ అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవి నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలోఅంబేద్కర్ సాక్షిగా మంత్రి కేటీఆర్‌‌‌‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికలు వస్తే తప్ప నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడని సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండడం మన దురదృష్టం అన్నారు. ఓట్ల కోసం వచ్చే టీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్లను ప్రజలు నిలదీయాలన్నారు.  కార్యక్రమంలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ జెస్సు అనిల్‌‌కుమార్, బ్యావత్ సాయికుమార్, తూర్పు రాజు, నాయకులు డీకే శ్రీనివాస్, కలిగోట ప్రశాంత్, బాసెట్టి రాజ్ కుమార్, పులి యుగంధర్, బారడ్ వినోద్, చావ్ల రాంరాజ్ పాల్గొన్నారు.

‘గన్ను’ రచనలు యువతకు ఆదర్శం

కామారెడ్డి, వెలుగు: ప్రముఖ కవి గన్ను కృష్ణమూర్తి రచనలు యువతకు ఆదర్శమని   కవి, రచయిత సురారం శంకర్ పేర్కొన్నారు. ఇటీవల చనిపోయిన గన్ను కృష్ణమూర్తి  సంస్మరణ సభను ఆదివారం కామారెడ్డి కర్షక్ బీఈడీ కాలేజీలో నిర్వహించారు.   ఇందులో పలువురు కవులు మాట్లాడుతూ కృష్ణమూర్తి సాహిత్య రంగానికి ఎనలేని సేవలను అందించారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక జిల్లా ప్రెసిడెంట్ గఫూర్ శిక్షక్, ప్రతినిధులు గంగా ప్రసాద్, నాగభూషణం, శేషరావు,  రామచంద్రం, ఆశోక్‌‌కుమార్‌‌‌‌ పాల్గొన్నారు.  

ఆర్టీసీ చైర్మన్‌‌ దిష్టి బొమ్మ దహనం 

సిరికొండ, వెలుగు: మండలంలోని పాకాల గ్రామానికి చెందిన యువకులు ఆర్టీసీ చైర్మన్‌‌, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ దిష్టిబొమ్మను  దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌‌‌‌ఎస్‌‌ వార్డు మెంబర్ గంగాధర్​ మాట్లాడుతూ గ్రామానికి రెండు నెలలుగా ఆర్టీసీ బస్సు రావడంలేదని, రోడ్డు సౌకర్యం సరిగా లేకుండా ఇబ్బందులు పడతున్నా బాజిరెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మూరుమూల  ప్రాంతంలో ఉన్న తమ గ్రామం అభివృద్ధి చెందడం లేదని వాపోయారు.   రమేశ్, ఆశోక్, గణేశ్‌‌ పాల్గొన్నారు. 

జీవో 69 ని రద్దు చేయాలి

నిజామాబాద్ టౌన్, వెలుగు: దొంగ బంగారం అక్రమ రికవరీని నిరోధించాలని, జీవో 69 రద్దు చేయాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్‌‌చారి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన విశ్వకర్మ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పరిపూర్ణాచారి, అడ్‌‌హక్ కమిటీ అధ్యక్షుడు సత్య ప్రకాశ్‌‌, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి విశ్వ రోజు పాల్గొన్నారు.