కొడిమ్యాల,వెలుగు: జగిత్యాలలో డిసెంబర్7న నిర్వహించే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చెయ్యాలని ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ లో 50 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సీఎం రానున్నట్లు తెలిపారు. సమావేశంల మండలాధ్యక్షుడు వెంకటేశ్, ఎంపీపీ స్వర్ణలత, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కృష్ణారావు, మల్యాల మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వం
సమాజానికి పనికొచ్చే ఆవిష్కరణలు చేయాలి
సైన్స్‌ఫేర్ ప్రారంభంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్
చొప్పదండి, వెలుగు: స్టూడెంట్లు సమాజానికి ఉపయోగపడే కొత్త ఆవిష్కరణలు చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీకూర రఘోత్తంరెడ్డి, కలెక్టర్కర్ణన్ అన్నారు. శనివారం చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ శిక్షణ స్కూల్లో నిర్వహిస్తున్న జవహర్ లాల్ నెహ్రూ జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌ను జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైనిక్ శిక్షణ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం ఇది రెండోసారి అని అన్నారు. గర్షకుర్తి స్కూల్ నుంచి ప్రదర్శనలు రెండుసార్లు ఇస్రోకు ఎంపికవడం గొప్ప విషయమన్నారు. ఈసందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు తీసుకువచ్చిన ప్రదర్శనలను పరిశీలించారు. కార్యక్యమంలో డీఈఓ జనార్దనరావు, జిల్లా సైన్స్ అధికారి జయపాల్‌రెడ్డి, ఎంపీపీ రవీందర్, సర్పంచి లింగయ్య, ఏఎంసీ చైర్మన్ చుక్కారెడ్డి
తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిది
హుజూరాబాద్, వెలుగు: మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు శ్రీకాంతాచారి త్యాగం అజరామరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. శనివారం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా పట్టణంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఉద్యమ సాధన కోసం అగ్నికి ఆహుతై, ప్రతి గుండెను రగిలించిన ఉద్యమ కాగడ శ్రీకాంతాచారి అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజు, ప్రవీణ్, సుధాకర్, శ్రీనివాస్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కథలాపూర్: తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా కథలాపూర్ మండల కేంద్రంలో శ్రీకాంతాచారి విగ్రహానికి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భూమయ్య, ఎంపీపీ రేవతి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ లింబాద్రి తదితరులున్నారు.
కోరుట్ల: శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా కోరుట్లలో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో నివాళు లర్పించారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శికారి గోపీకృష్ణ, లీడర్లు రాజేంద్ర ప్రసాద్, ప్రవీణ్ కుమార్, అనిల్, వినయ్ పాల్గొన్నారు.
బీజేపీకి ఓటేస్తే పథకాలు ఆపేస్తారు
జమ్మికుంట, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే అన్ని సంక్షేమ పథకాలు నిలిపేస్తారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం జమ్మికుంట ఎంపీడీఓ ఆఫీస్‌లో లబ్ధిదారులకు రూ.73 లక్షల విలువగల కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. ఈ సందర్బంగా కౌశిక్మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, ఎంపీపీ మమత, జడ్పీటీసీ శ్రీరాం, తహసీల్దార్రాజేశ్వరి, ఎంపీడీవో సతీశ్, పలు గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
ఆరేళ్లు దాటినా బ్రిడ్జి పనులు కాలే
వేములవాడ, వెలుగు: పట్టణ హై లెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసి ఆరేళ్లు గడిచినా నిర్మాణం పూర్తి కాలేదని పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. మూలవాగుపై బ్రిడ్జి నిర్మించాలని శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని, ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. బ్రిడ్జి శంకుస్థాపన కు అప్పటి రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2016లో శంకుస్థాపన చేశారని, ఇప్పటిదాకా పనులు పూర్తి కాలేదన్నారు. బ్రిడ్జి పనులు చేస్తున్నపుడే మూడుసార్లు కూలిపోవడం ఎమ్మెల్యే అసమర్థతకు నిదర్శనమన్నారు. పనులు వెంటనే పూర్తి చేయకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు లహరి, శ్రీనివాస్ గౌడ్, రాజ్ కుమార్, చంద్రశేఖర్, కరుణాకర్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.