సంత్‌‌‌‌ సేవాలాల్‌‌‌‌ మార్గంలో నడవాలి

సంత్‌‌‌‌ సేవాలాల్‌‌‌‌ మార్గంలో నడవాలి
  • సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి
  • మంత్రి సీతక్క సూచన

ములుగు, వెలుగు : సంత్‌‌‌‌ సేవాలాల్‌‌‌‌ మార్గంలో నడవాలని, పురాతన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. శుక్రవారం ములుగులో జరిగిన సేవాలాల్‌‌‌‌ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రంలో సంత్‌‌‌‌ సేవాలాల్‌‌‌‌ గుడి నిర్మాణానికి స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు. 

కమ్యూనిటీ హాల్‌‌‌‌ను సైతం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవాలాల్‌‌‌‌ జయంతి వేడుకల నిర్వహణకు రూ.2 కోట్లు కేటాయించడం సంతోషకరమన్నారు. సేవాలాల్‌‌‌‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. అలాగే కలెక్టర్‌‌‌‌ దివాకర్‌‌‌‌ టీఎస్‌‌‌‌ హాజరై సేవాలాల్‌‌‌‌కు మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ బానోతు రవిచందర్, మాజీ చైర్మన్‌‌‌‌ పోరిక గోవింద్‌‌‌‌నాయక్‌‌‌‌, బాల బ్రహ్మాచారి పాల్గొన్నారు.