బడ్జెట్2025..బంగారం ధరలు భారీగా పెరుగుతాయా? ఫిబ్రవరి1 తర్వాత ఏం జరగబోతోంది

బడ్జెట్2025..బంగారం ధరలు భారీగా పెరుగుతాయా? ఫిబ్రవరి1 తర్వాత ఏం జరగబోతోంది

ఇప్పుడు అందరి కళ్లు..కేంద్ర బడ్జెట్ 2025పైనే ఉన్నాయి..ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ 2025ని ప్రవేశపెట్టనున్నారు.. ఈ క్రమంలో బడ్జెట్ 2025 పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ సారి బడ్జెట్ లో మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రయోజనాలపై ఎక్కడ చూసినా ఇదే చర్చ. మరోవైపు కేంద్ర బడ్జెట 2025 తర్వాత బంగారం ధరలు ఎలా ఉంటాయనేదానిపై కూడా చర్చలు జోరందుకున్నాయి. 

కేంద్ర బడ్జెట్  2025లో బంగారం పై దిగుమతి సుంకం పెంచే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. ఇదేగనక జరిగితే  బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నా్రు ఆర్థిక నిపుణులు. ఈక్రమంలో 2025బడ్జెట్ కు ముందే బంగారం కొనుగోలు చేస్తే బాగుంటుందటున్నారు. 

Also Read : పార్లమెంట్‌‌‌‌లో కొత్త ఐటీ చట్టం?

జూలై 23, 2025న సమర్పించిన బడ్జెట్ 2024 లో బంగారం, వెండి కడ్డీలపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6శాతానికి తగ్గించిందికేంద్ర ప్రభుత్వం. దీంతో బంగారం దిగుమతులు ఆగస్టు 2024లో 104 శాతం పెరిగాయి. 

గత బడ్జెట్ లో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం మధ్య ధరల స్థిరీకరణ, తగ్గిన సరఫర క్రమంలో బంగారంపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచంలోనే బంగారం ఎక్కువగా వినియోగిస్తున్న రెండో   దేశం భారత్. డిమాండ్ ను తీర్చేందుకు ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుంది.