ఈ మధ్యకాలంలో జనాల్లో లైఫ్ స్టైల్, డైట్ పట్ల అవగాహన పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా కరోనా తరువాత చాలామందిలో హెల్త్ కాన్షియస్ నెస్ పెరిగింది. ఆరోగ్యాంగా ఉండటానికి డైట్ ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. డైట్ ఫాలో అయ్యేవారు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తప్పనిసరిగా తీసుకుంటారు. వీటితో పాటు ఇంకో ఐటమ్ కూడా డైట్ లో చేర్చుకుంటే ఎన్నో లాభాలు పొందొచ్చు. మన ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడే ఐటమే వాల్నట్స్... మెదడు ఆకారంలో ఉండే ఈ వాల్నట్స్ మెదడు ఆరోగ్యంతో పాటు ఎన్నో లాభాలు చేకూర్చుతాయి.
వాల్నట్స్ క్రమం తప్పకుండ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బాదం పప్పు మాదిరిగానే వాల్నట్స్ ను రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తింటుంటారు. అయితే, వాల్నట్స్ ను నానబెట్టుకొని తినాలా లేక డైరెక్ట్ గా తినాలా అన్న ప్రశ్న చాలామందిలో ఉంది. వాల్నట్స్ ను నీళ్లలో నానబెట్టుకొని తినటమే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
Also Read :- పిల్లలు తినడం లేదా.. అయితే ఇవి ట్రై చేయండి..
బ్రెయిన్ హెల్త్ కి తోడ్పడుతుంది:
వాల్నట్స్ ను బ్రెయిన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు.వీటిలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన వాల్నట్స్ తింటే మెదడు పనితీరు పెరిగి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి వాల్నట్స్.
డయాబెటిస్ ను నియంత్రిస్తుంది:
వాల్నట్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచటంలో తోడ్పడతాయి. టైప్-2 డయాబెటిస్ ప్రమాదం ఉన్నవారికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి.ఉదయాన్నే నానబెట్టిన వాల్నట్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. వాల్నట్స్ లో ఉండే హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్స్ బ్లడ్ సర్కులేషన్లో షుగర్ లెవెల్స్ నియంత్రిస్తాయి.
యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్స్:
వృద్దాప్యంలో కూడా యాక్టివ్ గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. వాల్నట్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సెల్యులార్ డ్యామేజ్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. ఏజింగ్ ఫ్యాక్టర్ ని నియంత్రించటంలో తోడ్పడతాయి. నానబెట్టిన వాల్నట్స్ తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కూడా తగ్గిస్తుంది.