కాంగ్రెస్ సిర్పూర్(టి) ఇన్ చార్జ్ కి షోకాజ్ నోటీస్

కాంగ్రెస్  సిర్పూర్(టి) ఇన్ చార్జ్ కి షోకాజ్ నోటీస్

ఆసిఫాబాద్, వెలుగు: కాంగ్రెస్  కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్(టి) అసెంబ్లీ ఇన్ చార్జి రావి శ్రీనివాస్ కు పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్  నోటీస్​ జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్  చిన్నారెడ్డి శుక్రవారం నోటీస్  జారీ చేశారు. 

పార్టీకి విరుద్ధంగా వ్యవహరించడం, గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేసినట్లు ఫిర్యాదు అందినట్లు నోటీసులో పేర్కొన్నారు. మంత్రి సీతక్కపై మీడియా ముందు విమర్శలు చేయడంపై వివరణ కోరింది. ఈ నెల 28లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.