కాంగ్రెస్ లీడర్​ గుడాల శ్రీనివాస్ కు షోకాజ్ నోటీస్

మహదేవపూర్, వెలుగు: జాతీయ స్థాయిలో చర్చకు తెర తీసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ లీడర్ డ్యాన్స్ చేసిన ఘటనను ఆ పార్టీ సీరియస్ గా తీసుకుని, షోకాజ్ నోటీస్ ఇచ్చింది. స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బందిపై జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.

 మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ కార్యకర్త గుడాల శ్రీనివాస్ డ్యాన్స్​ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కాంగ్రెస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాశ్​రెడ్డి నోటీసులు జారీ చేశారు. వీడియో వైరల్ కావడం వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిందని, ఏడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు.