వారి లక్ష్యం డబ్బులు సంపాదించడం..అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకొని ఎలా సంపాదించాలా అని ఆలోచించారు. ఓ యాప్ ను క్రియేట్ చేశారు. యూత్ ను టార్గెట్ చేశారు. ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. సక్సెస్ అయ్యారు. ఓ ఫ్లాట్ హాయిగా ఏసీలో కూర్చొని డబ్బులు సంపాదిస్తున్నారు.. యూత్ కు అశ్లీల కంటెంట్ ను అందిస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు.. అంతా ఆన్ లైన్.. ఒక్క కస్టమర్ నుంచి వెయ్యి నుంచి పదివేల వరకు వసూలు చేస్తున్నారు. ఎప్పుడూ బిజీ గా ఉంటే ముంబై నగరంలో ఇదో మంచి రాబడి మార్గంగా ఎంచుకున్న ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు.. వివరాల్లోకి వెళితే..
మొబైల్ యాప్ ద్వారా అశ్లీల కంటెంట్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. యాప్ యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. Google Play Store లో అందుబాటులో ఉన్న Pihu Official App అనే మొబైల్ అప్లికేషన్ లో ప్రత్యక్ష లైంగిక కంటెంట్ ను యాక్సెస్ చేయడానికి వినియోగ దారులను ప్రోత్సహిస్తున్నారని వెర్పోవా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం వినియోగ దారుల నుంచి రూ . 1000 నుంచి 10 వేల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు.
పక్కా సమాచారంతో వెర్సోవాల్ లోని ఫోర్ బంగ్లాలోని ఓ ఫ్లాట్ పై వెర్సోవా పోలీసులు దాడులు నిర్వహించారు. 20 యేళ్ల తనీషా రాజేష్ కనోజియా, 27 యేళ్ల రుద్ర నారాయణ్ రైత్ 34 యేళ్ల తమన్నాను అరెస్ట్ చేశారు. వీరంతా యాప్ ను అపరేట్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఐపీసీ, ఐటీ చట్టాల కింద వారిపై కేసులు నమోదు చేశారు.