చిన్నదొరకు తెలంగాణలో దోస్తులు లేరా?

  • మనమే సరిగ్గా లేనప్పుడు అవతలివారిపై ఏడ్వడం ఎందుకు ?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: హైదరాబాద్ లో నిన్న జరిగిన  క్రెడాయ్ సమావేశంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ 71వ రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..  మనమే సరిగ్గా లేనప్పుడు అవతలి వాళ్లపై పడి ఏడ్వడం ఎందుకన్నారు షర్మిల.

రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ సంతోషంగా ఉన్నారో చూచాలన్నారు. దీనిపై కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల. చిన్నదొరకు తెలంగాణలో దోస్తులు లేరా?ఇక్కడి సమస్యలు చెప్పట్లేదా?  కేసీఆర్, కేటీఆర్ కు తెలంగాణలో అరాచకాలు కనిపించడం లేదా? రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు కనిపిస్తలేవా? అమరుల కుటుంబాల బాధలు, ఉద్యమకారుల గోడు వినిపించడం లేదా? మీ దరిద్రపు పాలన చాలక దేశం ఏలడానికి పోతారా? టీఆర్ఎస్ అకౌంట్​ లోనే రూ.860కోట్లు ఉంటే.. ఇక కేసీఆర్ అకౌంట్​ లో ఎంత డబ్బు ఉందో ఊహించుకోలేం అన్నారు షర్మిల. 

‘కేటీఆర్ దోస్తులంతా మేఘా కృష్ణా రెడ్డి, ఫీనిక్స్ సురేష్ లాంటి ఆంధ్రా ధనవంతులే కదా.. తెలంగాణలో ఉద్యమకారులు, రైతులు, కౌలు రైతులు, నిరుద్యోగులు, ఆదివాసీలు, దళితులు, పేదలతో స్నేహం చేసి ఉంటే కదా చిన్న దొర గారికి తెలంగాణలోని ప్రజల కష్టం తెలిసేది ? చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

సొంత పార్టీ మేయర్ పై తిరగబడ్డ టీఆర్ఎస్ కార్పొరేటర్

చెన్నూరులో బీజేపీ నాయకులపై దాడి

సొంత పార్టీ మేయర్ పై తిరగబడ్డ టీఆర్ఎస్ కార్పొరేటర్

మాదేమైనా ఏపీలో అపోజిషన్ పార్టీనా?