తాజ్మహల్ హోటల్కు..షోకాజ్ నోటీస్

హైదరాబాద్ సిటీ, వెలుగు: అబిడ్స్ లోని తాజ్ మహల్ హోటల్ లో జీహెచ్ఎంసీ ఫుడ్​సేఫ్టీ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత పాటించ డం లేదని, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని, ఫుడ్​ఐటమ్స్​నిల్వచేసిన ప్రదేశంలో బొద్దింకలు ఉన్నాయని గుర్తించారు. యాజమాన్యానికి షోకాజ్​నోటీస్​ఇచ్చారు. మంగళవారం తాజ్​మహల్ హోటల్​పప్పులో జెర్రీ రావడంతో బుధవారం తనిఖీలు నిర్వహించినట్లు జీహెచ్ఎంసీ హెల్త్ అడిషనల్ కమిషనర్ పంకజ తెలిపారు.