
- అడిషనల్ కలెక్టర్ రాంబాబు
సూర్యాపేట, వెలుగు : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజావాణిలో మొత్తం 93 దరఖాస్తులు రాగా, వీటిలో ఎక్కువగా భూసమస్యలపై వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తులను ఆయ శాఖల అధికారులు ఫార్వర్డ్ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం భారతి రంగా ఆర్గనైజేషన్ ఫర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలోని 700 మంది టీబీ పేషెంట్లకు అడిషనల్ కలెక్టర్ 3 వేల న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు అందజేశారు.