మంచిర్యాల జిల్లాలో 284 మంది పంచాయతీ కార్యదర్శులకు అసిస్టెంట్ కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వివిధ గ్రామాలకు చెందిన 50 మందికి ఉపాధీ హామీ పని కల్పించనందుకు గాను ఈ నోటీసులు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శులు 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వకపోతే సీసీఏ రూల్ ప్రకారం చర్యలు తప్పవని అసిస్టెంట్ కలెక్టర్ హెచ్చరించారు. కాగా.. వ్యవసాయ పనుల కారణంగా కూలీలు ఉపాధి హామీ పనికి రావడం లేదని దానికి తాము ఎలా బాధ్యులం అవుతామని కార్యదర్శులు అంటున్నారు.
For More News..