
బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) అరుదైన మైల్ స్టోన్ దక్కించుకుంది. లేటెస్ట్ స్త్రీ2 మూవీ హిట్‌తో తన క్రేజ్‌ని దేశవ్యాప్తంగా పెంచుకుంది.
లేటెస్ట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్లలో ప్రభాస్ సాహో హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ప్రస్తుతం (2024 అక్టోబర్ 19) వరకు శ్రద్ధాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 93. 6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ముఖ్యంగా, కపూర్ తన పెంపుడు కుక్కతో ఫోటోలు పంచుకోవడం లేదా ఆహారం పట్ల తనకున్న ప్రేమను చూపడం వంటి వాటి ద్వారా సోషల్ మీడియాలో తన “అసలైన గుర్తింపు” దక్కించుకుంది. అలాగే తాజా స్త్రీ 2 సినిమాకు రూ. 800 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ రావడంతో ఫాలోయర్ల సంఖ్య మరింత రెట్టింపు అయింది.
ఇకపోతే హీరోయిన్స్ లో ప్రియాంక చోప్రాని 92 మిలియన్ ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అలియా భట్ మూడో ప్లేస్‌లో ఉంది. వీరి తర్వాత బాలీవుడ్ హీరోయిన్లు అలియా భట్‌కు 85.5 మిలియన్ల మంది ఫాలో అవుతోన్నారు.
కత్రినా కైఫ్ 80.4 మిలియన్లు నాలుగు స్థానంలో ఉండగా దీపికా పదుకొణెకు 80.3 మిలియన్ల ఫాలోవర్లతో ఐదో ప్లేస్‌లో ఉన్నారు. ఇక ఆరు, ఏడు స్థానాల్లో తమదైన బ్యూటీతో ఊర్వశి రౌటేలా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నిలిచారు.
అలాగే.. ప్రపంచ నాయకులతో సహా ప్రముఖ రాజకీయ నాయకుల కంటే ప్రధాని మోదీ చాలా ముందున్నారు. ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోడీని ఇన్‌స్టాలో 91.7 మిలియన్ మంది ఫాలో అవుతుండగా.. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (17.2M) ఫాలోవర్లు ఉన్నారు.
Also Read : యాక్టింగ్ బాగుందని చెబితే
ఇక ఇండియా మొత్తంలో చూస్తే.. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీని అత్యధికంగా 271 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.