
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ కొత్త కారు కొన్నారు. ఇందులో భాగంగా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ లెక్సస్ కి చెందిన లెక్సస్ LM 350h లగ్జరీ 7-సీటర్ కారును కొనుగోలు చేసింది. ఈ కారు ధర సుమారు రూ. 2.93 కోట్లు పైగా ఉంది. బ్లాక్ కలర్ లెక్సస్ కారులో ఇటీవలే శ్రద్దా కపూర్ జిమ్ కి వెళ్లొస్తూ ముంబై వీధుల్లో కనిపించింది. దీంతో ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
లెక్సస్ LM 350h లగ్జరీ కారు ఫీచర్లు చూసినట్లైయితే రిక్లైనింగ్ సీట్లు, 48-అంగుళాల భారీ స్క్రీన్, సన్‌రూఫ్, మినీ ఫ్రిజ్, వైర్‌లెస్ ఛార్జర్‌లు మరియు USB-C పోర్ట్‌లు ఉన్నాయి. ముఖ్యంగా లాంగ్ రైడ్ కి సౌకర్యంగా ఉండేట్లు తయారు చేశారు. దీంతో ఈ కారులో జర్నీ చేస్తుంటే ఫస్ట్-క్లాస్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తన్న ఫీల్ వస్తుందని సంస్థ అధికారులు చెబుతున్నారు.
Also Read : యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన స్టార్ హీరో
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే "స్త్రీ2" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా ఏకంగా వరల్డ్ వైడ్ రూ.880 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. దీంతో బాలీవుడ్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది.
అయితే శ్రద్ధా కపూర్ కార్ల కలెక్షన్ లో ఇప్పటికే రూ. 4 కోట్ల విలువైన లంబోర్గిని హురాకాన్ టెక్నికా కారును కలిగి ఉంది. అంతేకాదు ఆడి Q7, మెర్సిడెస్ GLA, BMW 7 సిరీస్ మరియు మారుతి స్విఫ్ట్ కూడా ఉన్నాయి.