బాలకృష్ణను బాల అని పిలవాలంటే భయమేసింది

బాలకృష్ణను బాల అని  పిలవాలంటే భయమేసింది

ఇటీవల ‘మెకానిక్ రాఖీ’తో ఆకట్టుకున్న శ్రద్ధా శ్రీనాథ్.. సంక్రాంతికి ‘డాకు మహారాజ్‌‌‌‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా శ్రద్ధా మాట్లాడుతూ ‘నేను ఇప్పటివరకూ డిఫరెంట్ సినిమాలు చేశాను కానీ ఇలాంటి చిత్రంలో నటించలేదు. ఎందుకంటే కామెడీ, యాక్షన్, ఎమోషన్ లాంటి ఎలిమెంట్స్‌‌‌‌తో ఓ పూర్తి ప్యాకేజ్‌‌‌‌లా ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు నందిని. ఎంతో ఓపికగా,  సాఫ్ట్‌‌‌‌గా ఉండే అమ్మాయి.

ఎప్పుడు మాట్లాడాలో తనకు స్పష్టంగా తెలుసు. ఎంతో డెప్త్, పెర్ఫార్మెన్స్‌‌‌‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్.  ఒక నటిగా ఈ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నా. ముఖ్యంగా ఇందులో డైలాగ్‌‌‌‌లు కరెక్ట్ మెజర్​లో ఉంటాయి. డబ్బింగ్ చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకున్నా. ఇక బాలకృష్ణ గారిలో ఓ బిగ్ స్టార్‌‌‌‌‌‌‌‌ అనే అహం కొంచెం కూడా చూడలేదు. సెట్స్‌‌‌‌లో ఎంతో సరదాగా ఉంటారు. నేను ఆయన్ను సార్ అని పిలుస్తుంటే, ఆయన మాత్రం బాల అని పిలవమన్నారు.

కానీ నాకు అలా పిలవాలంటే భయమేసింది.  ఇక దర్శకుడు బాబీకి సినిమా పట్ల ఎంతో పాషన్ ఉంది. నాకు ‘జెర్సీ’ లాంటి మెమొరబుల్ సినిమాను ఇచ్చిన సితార సంస్థలో మళ్లీ నటించడం సంతోషంగా ఉంది. ‘జెర్సీ’లో పోషించిన సారా పాత్ర స్థాయిలో ఇందులోని నందిని పాత్ర కూడా గుర్తుండిపోతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పింది.