Shraddha Walkar Murder:శ్రద్దా వాకర్ హత్యకేసులో 3 వేల పేజీల చార్జ్షీట్!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్దా వాకర్ హత్య కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చింది.  ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 3000 పేజీల డ్రాఫ్ట్ చార్జ్ షీట్ ను సిద్ధం చేశారు . ఈ చార్జ్ షీట్ లో 100 మంది సాక్షుల వాంగ్మూలం, ఎలక్ట్రానిక్ , ఫోరెన్సిక్  ఆధారాలను  నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్  నార్కోటిక్ టెస్ట్, ఫోరెన్సిక్ టెస్టు రిపోర్టులను కూడా జతచేయనున్నారు.  అయితే ఈ చార్జ్ షీట్ ను  ప్రస్తుతం న్యాయనిపుణులు పరిశీలిస్తున్నారు. 

మరో వైపు ఇటీవలే మొహ్రౌలీ అటవీ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న  దవడ భాగాలు సహా 13 ఎముకల  డీఎన్ఏ శ్రద్ధా తండ్రితో సరిపోలాయని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని ఓ ఫ్లాట్ లో  శ్రద్దా వాకర్ ను అఫ్తాబ్ పూనావాలా 2022 మే 18న అతి కిరాతకంగా హత్య  చేశాడు. డెడ్ బాడీని 35 ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచి ఢిల్లీలోని మోహ్రౌలీ  ప్రాంతంలో  పడేశాడు.