ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్‌లోని జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం శ్రమదానం నిర్వహించారు. స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు రెండు గంటల పాటు కాలనీలో రోడ్లను, డ్రైనేజీలను శుభ్రం చేశారు. చీపుర్లతో రోడ్లపై చెత్తాచెదారం ఊడ్చేశారు. కాలనీని శుభ్రంగా ఉంచడానికి 6 వారాలుగా ప్రతీ ఆదివారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ చెప్పారు.
కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ కుమార్, ఉపాధ్యక్షుడు కొక్కెర భూమన్న, ఘణపురం సంతోష్, సుంకె శ్రీనివాస్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, కార్యదర్శులు కొంతం రాజు, లోచారం సాయన్న తదితరులు పాల్గొన్నారు.