మెదక్జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ కొండగుట్టల మధ్య వెలసిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం బండమీది పాశం కార్యక్రమాన్ని చేపట్టారు.
స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం నైవేద్యాన్ని బండపై ఉంచి భక్తులు నాలికతో పాయసం తిన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు మల్లేశం తెలిపారు. - వెల్దుర్తి, వెలుగు