
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన శ్రవణ్ రావు పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో శ్రవణ్ రావు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. మార్చి 28న రాత్రి 2 గంటలకు దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన శ్రవణ్ రావు..నేరుగా పీఎస్ కు వెళ్లారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో 6 వ నిందితుడిగా ఉన్న శ్రవణ్రావు .. కేసు నమోదైన మరుసటిరోజే 2024మార్చిలో అమెరికాకు పారిపోయారు. 2025 మార్చి 26న పోలీసులు నోటీసులు పంపారు.మార్చి29న విచారణఖు రావాలని ఆదేశించింది. ముందస్తు బెయిల్ ను హైకోర్టు నిరాకరించడంతో శ్రవణ్ రావు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు ఊరట కల్పించడంతో ఇండియాకు వచ్చారు శ్రవణ్ రావు. ఇప్పటికే శ్రవణ్ రావు ఇంట్లో సోదాలు చేసింది దర్యాప్తు బృందం. శ్రవణ్ రావు నోరు విప్పితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
►ALSO READ | కార్యకర్తలకు హ్యాట్సాఫ్: స్థానిక సంస్థల ఉపఎన్నికలపై జగన్ ఎమోషనల్ ట్వీట్..
ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్న్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.