కన్నుల పండువగా శ్రీ గోపాలకృష్ణ మఠం రథోత్సవం

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: ఆదిలాబాద్ ​జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఆదివారం సాయంత్రం  నిర్వహించిన రథోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.

మఠాధిపతి యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాయల్​ శంకర్​ పాల్గొని ప్రత్యే పూజలు చేశారు. శ్రీకృష్ణ సహిత రుక్మిణి సత్యభామ ఉత్సవ విగ్రహాలతో పట్టణంలోని ప్రధాన వీధుల్లో రథయాత్ర నిర్వహించారు. భక్తులు ఆలపించిన భక్తి గీతాలు, భజన సంకీర్తలతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.